నాన్‌ వెజ్‌ వల్లే ప్రకృతి విపత్తులు… కీలక సూచన చేస్తున్న నెటిజన్లు!

ప్రకృతి విపత్తులు రావడానికి గల కారణం జనం నాన్ వెజ్ తినడమే అని చెప్పుకొస్తున్నారు ఒక పెద్దాయన! పైగా మాంసం తినమని విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేయాలని చెబుతున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్న ఇలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడటంతో ఒక సారి మానసిక వైద్యాలయంలో చూపించుకోమనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరిగింది. దీంతో “ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం”గా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

భారీవర్షాలు, ఫలితంగా విరిగిపడుతున్న కొండచరియలు, ఉప్పొంగుతున్న వాగులతో జనాలు ఇబ్బంది పడుతుంటే… తనదైన మేధావి తనంతో సరికొత్త లాజిక్ లాగారు బెహెరా. హిమాచల్‌ ప్రదేశ్‌ లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులకు కారణం ఇదే అంటూ ఒక వింత లాజిక్‌ వెతికారు ఐఐటీ ఎండీ డైరెక్టర్‌ లక్ష్మీధర్ బెహెరా!

హిమాచల్‌ ప్రదేశ్‌ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి డైరెక్టర్‌ గా ఉన్న లక్ష్మీధర్ బెహెరా తాజాగా ప్రకృతి విప్పత్తులకు గలకారణాలపై తనదైన తెలివితేటలతో ఒక కామెంట్ చేశారు. ఇందులో భాగంగా… జంతువులపై క్రూరత్వం కారణంగా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం జరుగుతుందని తెలిపారు.

తాజాగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన బెహరా… మనం ఇలాగే కొనసాగితే, నాన్ వెజ్ మానకపోతే.. హిమాచల్ ప్రదేశ్ మరింత దిగజారిపోతుందని పేర్కొన్నారు! మీరు ఈక్కడ జంతువులను చంపుతున్నారు.. అయితే పర్యావరణ క్షీణతతో ఇది సహజీవన సంబంధాన్ని కూడా కలిగి ఉంటుదన్న విషయం మీరు చూడలేరు అని వ్యాఖ్యానించారు. అనంతరం నాన్ వెజ్ తినమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు!

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా… ఈయన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. దీంతో కీబోర్డులకు పన్నిచెబుతున్న నెటిజన్లు ఘాటైఅన్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి సందీప్ మనుధనే ఘాటుగా స్పందించారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన సందీప్ మనుధనే… బెహరా వ్యాఖ్యలపై స్పందించారు. బయోఫిజిక్స్ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ బెహెరా ప్రకటన చాలా బాధాకరమని మొదలుపెట్టిన ఆయన… 70 ఏళ్లలో ఏది కట్టినా ఇలాంటి మూఢ మూర్ఖులు దాన్ని నాశనం చేస్తారని కాస్త ఘాటుగానే స్పందించారు.

అయితే బెహరా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. మరోసారి ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం నష్టనివారణ చర్యల్లో భాగంగా సైలంట్ గా ఉన్నారని సమాచారం!