`నిర్భయ`, `దిశ` చట్టాలు లాంటివి అమలులో ఉన్నా దేశంలో అత్యాచారాలు మాత్రం అదుపులోకి రాలేదు. శిక్షలు ఎంత కఠినంగా అమలు పరిచినా అత్యాచారాలు యధేశ్చగా జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో చోట ఇలాంటి ఘటన తరుచూ చోటు చేసుకుంటూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా మానవ మృగాలు చెలరేగిపోతూనే ఉన్నాయి. కళ్లు మూసుకుపోయి పాశవిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా అత్యాచారాల్ని ప్రభుత్వాలు అదుపు చేయలేవా? అన్న సందేహాలు మరింత పెరిగిపోతున్నాయి. చివరికి ఎన్ కౌంటర్లు చేసి చంపేసినా మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు.
ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని చంపడమో! శిక్షించడమో కాదు..బ్రతికినంత కాలం జీవశ్చవంలా చేసే విదేశా తరహాలో కొత్త చట్టాల్ని భారతదేశంలోకి కూడా తీసుకురావాలి. అవును నైజీరియాలోని ఒక రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అలాగే ఉంది. రేప్ అనే మాట వింటేనే బెంబేలెత్తిపోయేలా అక్కడి ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అత్యాచార నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించాలనే ఈ చట్టాన్నీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నైజీరియాలోని కుదుమా రాష్ర్టంలో 14 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడి, దోషిగా నిర్ధారణ అయితే ఆపరేషన్ చేసి పురుషత్వం కోల్పోయేలా చేయాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫైల్ రాష్ర్ట గవర్నర్ ముందుకు సంతకం కోసం వెళ్లింది. గవర్నర్ సంతకం పెడితే అది చట్ట రూపం దాల్చినట్లే. కుదువాలో ఇటీవలి కాలంలో ఇలాంటి నేరాలు ఎక్కువ అవ్వడంతోనే ఆ రాష్ర్ట ప్రభుత్వం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమైంది. చివరికి ఎమర్జెన్సీ ని కూడా విధించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అత్యాచారానికి గురైన బాధితురాలు సమాజం ఎక్కడ చిన్న చూపు చూస్తుందోనని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. ఆఆ భయాన్ని ఆసరాగా చేసుకుని మానవ మృగాలు ఆడ పిల్లలపై, మహిళలపై పడి చెరిచేవారు. మరి ఈ కొత్త చట్టంతోనైనా ఇలాంటి పాశవిక చర్యలకు పుల్ స్టాప్ పడుతుందేమో.