టిమిండియా క్రికెటర్ అంబటి రాయుడు బౌలింగ్ చేయకుండా ఐసిసి నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో తొలి వన్డేలో రాయుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఈ బౌలింగ్ ను ఐసీసీ తప్పు పట్టింది. ఈ నివేదికను ఐసీసీ భారత్ మేనేజ్ మెంట్ కు అందించింది. 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చింది. రాయుడు ఈ పరీక్షకు హాజరు కాలేదు. దీంతో ఐసీసీ నిబంధనల మేరకు అంతర్జాతీయ క్రికెట్ లో రాయుడు బౌలింగ్ చేయరాదని, దేశవాళీ, బిసిసిఐ పరిధిలో జరిగే మ్యాచ్ లలో బౌలింగ్ చేసుకోవచ్చని ఐసీసీ స్పష్టం చేసింది.
జనవరి 13 లోగా రాయుడు బౌలింగ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉండేను. కానీ న్యూజిలాండ్ పర్యటనలో బిజిగా ఉండడంతో రాయుడు హాజరు కాలేకపోయాడు. దీంతో ఐసీసీ క్లాజ్ 4.2 ప్రకారం చర్యలు తీసుకుంది. ఒకవేళ రాయుడు పరీక్షకు హాజరై తన బౌలింగ్ సరైనదేనని నిరూపించుకుంటే రాయుడు పై ఐసీసీ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉంది. అతను పరీక్షకు హాజరు కానంత వరకు నిషేధం కొనసాగుతుంది.
రాయుడు ఎప్పుడైనా పార్ట్ టైం స్పిన్నర్ గానే వ్యవహరించాడు. తన 46 మ్యాచ్ ల వన్డే కెరీర్ లో 20.1 ఓవర్ల బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్, ట్వంటీ ట్వంటీల్లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలుద. సిడ్నీ వన్డేలో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు. అంబటిరాయుడు స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా. అంబటి రాయుడు కుటుంబం హైదరాబాద్ లో సెటిలయ్యింది. దీంతో హైదరాబాదీ ఆటగాడిగా అంబటి రాయుడికి పేరుంది.