పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత్

పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి చూపించింది. సర్జికల్ స్ట్రైక్ 2లో దెబ్బతిన్న పాక్ భారత్ ను ఏం చేయలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. జమ్మూ కశ్మీర్ లోని నౌషేరా సెక్టార్ లో పాక్ యుధ్ద విమానాలు భారత భూభాగంలోకి బుధవారం ఉదయం దూసుకొచ్చాయి. పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ద విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. గగన తలంలోకి వచ్చిన ఈ విమానం పై భారత బలగాలు కాల్పులు జరిపాయి.  ఆ

 విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లామ్ వ్యాలీలో 3 కిలో మీటర్ల దూరంలో కుప్పకూలింది. విమానం నుంచి పైలట్ ప్యారాచూట్ ద్వారా కిందకు దిగుతున్న సీన్ కనిపించింది. కానీ ఆ తర్వాత ఏమైంది అనే దాని పై క్లారిటి లేదు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్ శ్రీనగర్, జమ్మూ, లేహ్, ఛంఢీఘర్, అమృత్ సర్ ఏయిర్ పోర్టులను మూసేసింది. దీంతో పాక్ కూడా లాహోర్, ఇస్లామాబాద్, ఫైజలాబాద్, ముల్తాన్ ఎయిర్ పోర్టులను మూసేసింది.

ఏ క్షణంలో ముప్పు వచ్చినా ఎయిర్ ఫోర్స్ ద్వారా ఎదుర్కోనేందుకు భారత్ పాక్ లు సిద్దమయ్యాయి. భారత్ గట్టిగా వ్యతిరేకించడంతో పాక్ బలగాలు తోకముడిచాయి. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత ప్రజల్లో ఏర్పడింది. సరిహద్దు గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు.