పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఓ అనుభూతి. ఆ అనుభూతి ఎన్నో మార్గాలకి కారణమవుతుంది. మరెన్నో బంధాలకి మూలంగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే .. తల్లీకూతుళ్లు ఒకేసారి, ఒకే మండపంలో, ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకున్నారు. వారికి నచ్చిన వారిని పెళ్లాడి కొత్త జీవితాలను ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన 53 ఏళ్ల తల్లి, 27 ఏళ్ల కూతురు వారి జీవిత ఒకే వేదిక పై పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సీఎం సామూహిక వివాహ యోజన కింద గోరఖ్ పూర్ లోని పిప్రౌలీలో జరిగిన వివాహాల్లో ఈ అరుదైన సందర్భం జరిగింది. దాదాపు 30ఏళ్ల క్రితం హరిహర్ ను బెలీదేవీ వివాహం చేసుకుంది.
అమెకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఆమె భర్తను కోల్పోయింది. ప్రస్తుతం ఆమె చిన్న కూతురు ఇందూకు తప్ప అందరికీ వివాహం అయింది. ఉద్యోగాలు చేస్తూ జీవితాల్లో స్థిరపడిపోయారు. దీంతో ఇక మిగిలిన జీవితాన్ని జగదీశ్ తో పంచుకోవాలని బెలీ దేవీ నిశ్చయించుకొని వివాహమాడింది. చిన్న కూతురు ఇందూ కూడా పెళ్లి కూడా అదే వేడుకలో పెళ్లి చేసుకుంది. ఈ వేదికలో 63 జంటల పెళ్లిళ్లు కాగా.. కొందరు ముస్లిం జంటలు సైతం ఈ సామూహిక వివాహాల్లో ఒక్కటయ్యారు.