ఇంటర్ అర్హతతో హిందుస్థాన్ పెట్రోలియంలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

హిందుస్థాన్ పెట్రోలియం నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. 60 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా అసిస్టెంట్ ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆపరేటర్ పోస్టులు 18, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 7, అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి.

https://www.hindustanpetroleum.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు మాత్రం 590 రూపాయలు దరఖస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. బీఎస్సీ, ఐటీఐ, డిప్లొమా, తత్సమాన కోర్సులు చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హెవీ వెహికల్ లైసెన్స్ తో పాటు ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ఎంతగానో బెనిఫిట్ కలగనుంది.