టెన్త్ పాస్ అయిన వారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 12 వేలకు పైగా ఖాళీలు.. ?

ప్రస్తుత కాలంలో మనిషికి ఉద్యోగం అనేది చాలా అవసరం. గ్రామాలలో నివసించే ప్రజలందరూ కూడా వ్యవసాయం చేయలేక ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని బ్రతకాలని పట్టణాలకు తరలివస్తున్నారు . ఈ క్రమంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇలా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల శుభవార్త తెలియజేసింది. పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. పదవ తరగతి పాసైన వారు ఉద్యోగాలకు అర్హులు.

వివరాలు లోకి వెళ్తే.. టాస్కింగ్ స్టాఫ్‌, హవల్దార్‌ వంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలు భర్తీ చేయడానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హులైన అభ్యర్థులందరూ ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వచ్చే నెల 19వ తేదీ లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 12,523 ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోవటానికి ఫిబ్రవరి 19వ తేదీ చివరి గడువు. అందువల్ల 19వ తేదీలోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

మొత్తం 12,523 ఉద్యోగాలలో ఎంటీఎస్‌ 11,994, హవల్దార్‌ 529 ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఎమ్‌టీఎస్‌ పోస్టులకు దరఖాస్తు చెయ్యచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అదే హవల్దార్‌ పోస్టులకు అయితే శారీరక ప్రమాణాలతో పాటు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. హవల్దార్‌ పోస్టులకు అభ్యర్థులను పీఈటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్‌ నెల లో నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేయటానికి https://ssc.nic.in/ అనే వెబ్ సైట్ లో ధరకాస్తు చేసుకోవచ్చు.