పదవతరగతి పాస్ అర్హతతో అనేక ఉద్యోగాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. 10th క్లాస్ విద్యార్హతతో ప్రతి ఏడాది భారీగా ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ సిద్ధం అవుతోంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ SSC GD Constable నియామకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సన్నద్ధమవుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఉండే వార్షిక క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నవంబర్ 24వ తేదీన ఈ నోటిఫికేషన్ వెలువడనుంది.
కాగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 నాటికి పూర్తి కానుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులను భర్తీ చేశారు. ఈ ఏడాది అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టుల భర్తీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారికి పదో తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఆ తర్వాత మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా పోస్టుల భర్తీ కూడా జరుగనుంది. కాగా కేంద్ర సాయుధ బలగాల్లో ఈ ఏడాది కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. కానిస్టేబుల్ రాత పరీక్షలు ఈ నెల అనగా నవంబర్ 14, 15, 16, 17, 20, 21, 22, 23, 24, 28, 29, 30 డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది 2024 కానిస్టేబుల్ SSC GD Constable రాత పరీక్షలు ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29 మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగనున్నాయట.