కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని ఆర్థికం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చాలామంది భావిస్తారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే మెజారిటీ ఉద్యోగాలకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ పోస్టులు మొత్తం 2006 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆగష్టు నెల 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆగస్టు 27 నుంచి 28 వరకు దరఖాస్తును ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1994 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్ట్‌లకు 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు అర్హత ఉంటుంది. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ssc.gov.in వెబ్ సైట్ లో నోటిఫికేషన్ వివరాలను పరిశీలించి ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉండనుందని తెలుస్తోంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, తర్వాత స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.