స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 1,930 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1,930 నర్స్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. జనరల్ కేటగిరీలో 892 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఓబీసీ కేటగిరీలో 446, ఎస్సీ కేటగిరీలో 235, ఎస్టీ కేటగిరీలో 164, పీడబ్ల్యూబీడీ కేటగిరీలో 168 బీసీ కేటగిరీలో 193 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారు.

మొత్తం 1930 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం, ఈ పోస్టులకు 34800 రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. జనరల్ కేటగిరీ, బీసీలకు 30 సంవత్సరాలు వయో పరిమితి కాగా మిగతా అభ్యర్థులకు కేటగిరీల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నర్సింగ్ నర్సుగా రిజిస్టర్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ ద్వారా రాతపరీక్ష వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

https://upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్చి నెల 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 80 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జులై నెల 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హత పరీక్షను నిర్వహిస్తారు.