కేంద్రం నుంచి పాడి రైతులకు సులువుగా రూ.7 లక్షల లోన్.. ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో సరైన వ్యాపారాలు చేయడం ద్వారా పాడి రైతులు కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా వ్యాపారం చేస్తే సులువుగా సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. లాభసాటి వ్యాపారాలలో పశువుల పెంపకం ఒకటి కాగా ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

పాల వ్యవస్థాపక అభివృద్ధి పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా రైతులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 10 గేదెలను కలిగి ఉన్న రైతులు 7 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. లోన్ పొందిన మొత్తంలో 33 శాతం సబ్సిడీగా లభిస్తుంది. కులాన్ని బట్టి సబ్సిడీ పొందే మొత్తంలో స్వల్పంగా మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ బిజినెస్ చేయాలంటే ఎంతో ఓపిక, అనుభవం ఉండాలి.

2010 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ పై పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రుణంగా తీసుకున్న మొత్తంలో సబ్సిడీ పోగా మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పాడి రైతులు అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.

సమీపంలోని బ్యాంకులను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్ లో కచ్చితంగా సక్సెస్ సాధించాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. పశువుల పెంపకం, పాడి పరిశ్రమ ఎన్నో ఉద్యోగాలతో పోల్చి చూస్తే మంచి లాభాలను అందిస్తోంది.