గ్యాస్ వినియోగదారులు అలర్ట్… గ్యాస్ సిలిండర్ విషయంలో పాటించాల్సిన కొత్త రూల్స్ ఇవే!

ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ విషయంలో మరొక కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇకపై గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో లిమిట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇదివరకు మనం ఏడాదికి ఎన్ని సిలిండర్లైన బుక్ చేసుకుని అవకాశం కల్పించారు. అయితే ఇకపై అలాంటి అవకాశం లేదని గ్యాస్ బుకింగ్ విషయంలో కూడా నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు.

కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఏడాదికి కేవలం 15 సిలిండర్లను మాత్రమే బుక్ చేసుకుని అవకాశం వినియోగదారులకు కల్పించారు. ఈ లిమిట్ కనుక దాటితే గ్యాస్ బుకింగ్ కాదని కానీ పక్షంలో సిలిండర్ పొందే అవకాశం కూడా ఉండదని తెలియజేస్తున్నారు. ఇకపోతే నెలలో కేవలం రెండు సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవాలని రెండుకుమించి ఎక్కువ బుక్ చేసుకోవడానికి వీలు లేదు ఇలా ఏడాదికి 15 సిలిండర్లను మాత్రమే పరిమితి చేసింది.

వినియోగదారులు ఎక్కువగా సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలోనే ఎల్పిజి గ్యాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.ఇదే కాకుండా ప్రతినెలా సిలిండర్ ధరలలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తున్న విషయం తెలిసిందే గత కొంతకాలం నుంచి సిలిండర్ ధరలలో ఏ మాత్రం తగ్గుదల లేకుండా పెరుగుతూ వస్తుంది.