ఈ ప్రభుత్వ స్కీమ్ ద్వారా రూ.15 లక్షలు పొందే అవకాశం.. ఎలా పొందాలంటే?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం అమలు చేస్తున్న ఒక స్కీమ్ ద్వారా రైతులు ఏకంగా 15 లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వాళ్లు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా పరిశ్రమను మొదలుపెట్టాల్సి ఉంటుంది. వ్యవసాయ వ్యాపార అవసరాల కోసం, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల కోసం ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత 15 లక్షల రూపాయల వరకు గ్రాంట్ ఆఫ్ మ్యాచింగ్ ఈక్విటీ లభిస్తుంది.

ఈనాం వెబ్ సైట్ లో రైతులు నమోదు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వచ్చే ఏడాది నాటికి 10,000 ఈ.ఎఫ్.వోలను ఏర్పాటు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. 15 లక్షల రూపాయల రుణంను మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణం పొందిన వాళ్లు ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసి పనులు మొదలుపెట్టాల్సి ఉంది.

ఈ స్కీమ్ కు ఎంపికైన వాళ్లకు ప్రభుత్వం ఐదేళ్ల పాటు సహాయ సహకారాలు అందించనుంది. 15 లక్షల రూపాయలు అంటే తక్కువ మొత్తం కాదు. ఈ స్కీమ్ ను రైతులు ఉపయోగించుకుని ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందితే మంచిది. సమీపంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.