తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదిలు ప్రకటించిన ఈసీ

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా సీఈసీ ప్రకటించింది. 

నవంబర్ 12న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్

డిసెంబర్ 7 న తెలంగాణ ఎన్నికలు

డిసెంబర్ 11న తెలంగాణ ఎన్నికల ఫలితాలు

ఒకే దశలో తెలంగాణ ఎన్నికలు.

నవంబర్ 19 నామినేషన్ల దాఖలుకు గడువు

నవంబర్ 20న నామినేషన్ల పరీశీలన

నవంబర్ 22 నామినేషన్ల ఉపసంహరణ గడువు

తెలంగాణలో ఒకే దశలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. అక్టోబర్ 12 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామంది.  ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అయినప్పటికి కూడా త్వరలోనే కోర్టు తీర్పు వస్తుందనే ఉద్దేశ్యంతో ఈసీ తన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు డిసెంబర్ 15 లోగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రావత్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తామని రావత్ అన్నారు. నాలుగు రాష్ట్రాలకు వీవీ ప్యాట్ లు, ఈవీఎంలు సిద్దం చేశామన్నారు.

అక్టోబర్ 16న ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 12 న ఛత్తీస్ ఘడ్ మొదటి విడత ఎన్నికలు, నవంబర్ 20న రెండో విడత ఎన్నికలు

మధ్యప్రదేశ్ లో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు

మిజోరాంలో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు

డిసెంబర్ 7న రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు

నవంబర్ 12న తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ , డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్

ఒకే దశలో తెలంగాణ ఎన్నికలు

డిసెంబర్ 11 న తెలంగాణ ఎన్నికల ఫలితాలు

 

మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.20లక్షలు, మిగతా నాలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును రూ.28లక్షలు మించకూడదని నిబంధన విధించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.