TS: పెరగునున్న విద్యుత్ చార్జీలు..!

TS: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది.

విద్యుత్‌ ఛార్జీలు పెరగనుండటంతో భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది. 120 రోజుల తర్వాత పెరిగిన విద్యుత్ చార్జీలు అమల్లోకి రానుండగా.. గృహ కనెక్షన్ కు యూనిట్ కు 50 పైసలు, HT వినియోగదారులకు రూ. 1 పెంచనున్నారు. రూ. 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఏడేళ్ల తర్వాత విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈ ఆర్సీ (Electricity Regulatory Commission) కి డిస్కమ్ లు అందించాయి. రూ. 10,928 కోట్ల ద్రవ్య లోటు ఉందని నివేదిక లో డిస్కమ్ లు పేర్కొన్నాయి.

ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉంది. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని టీఎస్ ఎస్పీడిఎసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్తున్నారు