ఈ కాలంల అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. బస్సులల్ల, రైళ్లల్ల ఫుట్ బోర్డు ప్రయాణం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుర్రు. ముంబైలోని లోకల్ రైళ్లో స్టంట్స్ చేయబోయి ఓ అమ్మాయి అదృష్టం కొద్ది బతికి బయటపడ్డది. ఆ అమ్మాయి రైలులో నుంచి జారి క్షేమంగా వచ్చిన వీడియో కింద ఉంది చూడండి.
ముంబాయి లోకల్ రైలులో ఫుట్ బోర్డు వద్ద 17 ఏళ్ల అమ్మాయి స్టంట్స్ చేయబోయి కిందకు జారింది. ఆ వెంటనే పక్కకున్న యువకుడు ఆమె చేయి పట్టుకొని పైకి లాగాడు. రైలు వెళుతున్న వేగానికి అమ్మాయి కింద పడితే ఖచ్చితంగా ప్రాణాలు పోయేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.