కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోతీలాల్ వోరా చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వోరా మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.
మోతీలాల్ వోరా మధ్యప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
1970లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1972 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1977, 80, 85లోనూ విజయం సాధించి, పలు మంత్రి పదవులు నిర్వహించారు. 1985 మార్చి 13న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు