కరిచిన పామును ఈ ఆంటీ ఏం చేసిందంటే (వీడియో)

ఎవరైనా పాము కరిస్తే ఏం చేస్తారు వెంటనే పాము కరిచిన వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకెళతారు. ఇంతలో పాము దొరికితే దాన్ని అక్కడే చంపేస్తారు. కానీ  ఓ మహిళ మాత్రం తనను కరిచిన పామును చేతికి చుట్టేసుకుంది. అలాగే దానిని పట్టుకొని హాస్పిటల్ కు వెళ్లింది. దీంతో పామును చుట్టుకొని వచ్చిన మహిళను చూసి సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఈ ఘటన చైనాలోని బెజియాంగ్ ప్రావిన్స్ లో జరిగింది. సుమారు 1.5 మీటర్ల పొడవు ఉన్న పాము మహిళను కరిచింది. అది విషపూరితమైన పాము కాదట. అందుకే పాము కరిచినా ఆ మహిళకు ఏమి కాలేదు. ఆ మహిళ సరాసరిగా పామును తీసుకొని హాస్పిటల్ కు వచ్చి తను చికిత్స చేయించుకుంది. చికిత్స తీసుకున్న తర్వాత పామును ఓ బాటిల్ లో వేసుకొని తను అక్కడ నుంచి వెళ్లి పోయింది. ఆ మహిళ పాముతో హాస్పిటల్ లో వేచి ఉన్న వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో కింద ఉంది చూడండి.