రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కు కేంద్ర సమాచార కమిషనర్ (సిఐసి)మాడభూషి శ్రీధర్ షోకాజ్ నోటీస్ పంపించారు. స్వయంప్రతిపత్తి ఉన్న కేంద్ర సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వానికి దాసోహమంటున్నపుడు, సెంట్రల్ ఇన్ ఫర్మేషన్ కమిషన్ ను నిటారుగా నిలబెడుతున్న అధికారి మాడభూషి శ్రీధర్. చట్టాన్ని ఎవరైనాసరే కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, ప్రధాని కార్యాలయం దగ్గిర నుంచి ఒకప్పటి మానవవనరుల శాఖనుంచి రిజర్వు బ్యాంక్ దాక పట్టబడుతున్న రాజ్యాంగాధికారి శ్రీధర్. ప్రొఫెసర్ శ్రీధర్ నిర్ణయాలన్నీ ఇన్ ఫర్మేషన్ కమిషన్ చరిత్రలో గొప్ప ఉదాహరణలుగా మిగిలిపోనున్నాయి. ఇలాంటి నిర్ణయాలలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కు షో కాజ్ నోటీసు జారీ చేయడం ఒకటి. రిజర్వు బ్యాంకు వంటి సంస్థమీద ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం గతంలో జరిగినట్లు లేదు.
ఈ చర్య ఎందుకు తీసుకోవలవసి వచ్చిందంటే…
బ్యాంకులకు ఉద్దేశ పూర్వకంగా రు 50 కోట్ల కంటే ఎక్కువ మొత్తాలను ఎగ్గొట్టిన వారి వివరాలందించాలని ఒక వ్యక్తి రిజర్వు బ్యాంక్ ను కోరారు.
దీనితో పాటు ఇలా రుణాలను తీసుకున్న వారికి గ్యారంటీ ఉందా లేదా, ఉండే పూచీపడిన వారెవరు, ఎంత రుణం విడుదల చేశారు, ఎంత ఎగ్గొట్టారు, వీళ్ల మొండిబాకీ ఎంత ఉందనే సమాచారాని కూడా సమాచారం చట్టం కింద కోరారు. అయితే, ఇలా బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారిపేర్లను ప్రకటించడం సాధ్యం కాదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. అయితే, బ్యాంకులను ముంచిన వారి పేర్లను దాచాలనుకోవాలనుకోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది.

ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా రిజర్వు బ్యాంక్ ఖాతరు చేయకపోవడం పట్ల కమిషన్ అసంతృప్తికి గురయింది. రుణాలు ఎగ్గొట్టిన వారిని కాపాడి రుణాలందించిన బ్యాంకులను ఇరుకున పెట్టవద్దని పటేల్ కు కమిషన్ సూచించింది. అందువల్ల ఈ దరఖాస్తు దారు కోరినట్టు సుప్రీం కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి పేర్లను ప్రకటించనిరాకరించినందుకు భారీగా జరిమానా ెందుకు విధించరాదో చెప్పాలని కమిషనర్ శ్రీధర్ ఫోకాజ్ నోటీసు పంపించారు. అంతేకాదు, మొండి బాకీల మీద గత గవర్నర్ రఘురామ్ రాజన్ 2015 ఏప్రిల్ లో రాసిన లేఖను కూడా బహిరంగం చేయాలని శ్రీధర్ ప్రధాని కార్యాలయానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా ఆదేశాలిచ్చారు.
రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ కూడా చీఫ్ పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్ గా పరిగణించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిపెద్ద నిర్నయం. దీనితో ఏదేని డిపార్ట్ మెంటులో కోరిన సమాచారం అందివ్వకపోతే, అక్కడి సిపిఐఒనేకాదు, అధికారిని కూడా కేసులోకి లాగవచ్చు.
ఉత్తర్వుల ప్రకారం బాకీలు ఎగ్గొట్టిన వారి పేర్లను బహిరంగ పర్చాలన్నసుప్రీకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయనందుకు గవర్నర్ మీద కూడా భారీ జరిమాన ఎందుకు విధించరాదో చెప్పాలని కమిషనర్ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

రిజర్వుబ్యాంక్ లో పారదర్శకత, నిజాయితీ,న్యాయవిచారణ వంటి అంశాలను తుచ తప్పకుండా పాటిస్తామని గవర్నర్ సివిసికి తెలియపర్చిన విషయాన్ని కూడా శ్రీధర్ పటేల్ కు గుర్తు చేశారు. ఆర్ టిఐ దరఖాస్తు దారు కోరిన సమాచారం ఇవ్వనందుకు రిజర్వు బ్యాంక్ చీఫ్ పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్ ను శిక్షించలేము. ఎందుకంటే, ఆయనపై అధికారుల ఉత్తర్వుల మేరకే నడచుకుంటారు. అందువల్ల గవర్నర్ మీద చర్య తీసుకొనక తప్పదని పేర్కొన్నారు.
“The Commission considers the Governor as deemed PIO responsible for non-disclosure and defiance of SC orders and CIC orders and directs him to show cause why maximum penalty should not be imposed on him for these reasons, before November 16, 2018,” అని శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ షోకాజ్ నోటీసు మీద నవంబర్ 16 లోపు రిజర్వు బ్యాంక్ కమిషన్ కు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఉద్దేశపూర్వకంగా బాకీలు ఎగ్గొట్టి బ్యాంకులను ముంచేసిన వారి సమాచారం బయటపట్టకుండా కాపాడాలనుకునే ముందు ,పంటలు పండక, గిట్టుబాటు ధర లేక, చిన్న చిన్న బ్యాంకు రుణాలను తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులనొకసారి గుర్తు చేసుకోండని కూడా శ్రీధర్ రిజర్వు బ్యాంక్ గవర్నర్ కు సూచించారు.
“The Commission recommends the RBI governor to remember once, at least one of the 3 lakh farmer dying in the field as he failed to sustain his crop or to sell his produce for appropriate price and hence could not pay of the debt before defying the transparency law and directions. The order suggests that the RBI should discontinue immediately the non-disclosure policy as it ‘will seriously harm of the economy of this nation.”
