కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అసంఘటిత రంగంలోని కార్మికులకు బెనిఫిట్ కలిగేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సరక్ష బీమా యోజన స్కీమ్స్ ద్వారా పేద ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తలు ఈ స్కీమ్ లో చేరితే నెలకు 10,000 రూపాయలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ మొత్తంలోనే ఈ స్కీమ్ లో చెల్లించే అవకాశం ఉండగా వయస్సు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. బ్యాంకుల ద్వారా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నెలకు కనీసం 42 రూపాయలు కంట్రిబ్యూషన్ చేయడం ద్వారా 1000 రూపాయల కనీస పెన్షన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయన్ చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఏక మొత్తంలో పొందాలంటే 8.5 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుంది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సరక్ష బీమా యోజన స్కీమ్స్ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం లాభాన్ని అందిస్తాయి. ఈ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.