కేంద్రం సూపర్ స్కీమ్.. సున్నా వడ్డీతో రూ.3 లక్షలు.. సగమే కట్టాలంటూ?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు, మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్స్ లో ఉద్యోగిని స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా 3 లక్షల రూపాయల లోన్ అందిస్తోంది. వ్యాపారం చేయాలని భావించే మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

సున్నా వడ్డీతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న మొత్తంలో సగం సబ్సిడీ పొందవచ్చు. 2020 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతుండగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలు ఈ స్కీమ్ కు అర్హులు.

తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించే సామర్థ్యం ఉన్న మహిళలు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు 6 రోజుల పాటు ట్రైనింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు భర్త చనిపోయిన మహిళలు, అంగ వైకల్యం ఉన్న మహిళలు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

ఆరేళ్ల టెన్యూర్ తో ఈ స్కీమ్ లో తీసుకున్న రుణాన్ని సులువుగా చెల్లించే అవకాశం ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. లోన్ కు అవసరమైన డాక్యుమెంట్లను అన్నీ జత చేయడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. మహిళలకు ఈ స్కీమ్ వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.