కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ ను అందిస్తుండగా పీఎం కీసాన్ స్కీమ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. త్వరలో పీఎం కిసాన్ 14వ విడత నగదు జమ కానున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పీఎం కిసాన్ ఎఫ్.పీ.వో పేరుతో ఒక స్కీమ్ అమలవుతోంది. రైతుల స్వావలంబన లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.
ఈ స్కీమ్ ద్వారా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించాలని భావించే రైతులకు ఏకంగా 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ 15 లక్షల రూపాయల లోన్ ను పొందవచ్చు. 11 మంది రైతులు కలిసి కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
మందులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రద్దు చేయబడిన చెక్కును పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ స్కీమ్ వల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. రైతులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.