బోర్ కొడుతోందని ఓ 15 ఏళ్ల బాలుడు చేసిన ఫోన్ కాల్ అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఏకంగా 60 ఏళ్ల మహిళతో అతనికి వివాహమయ్యేలా చేసింది. అసోంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
చదువు మానేసి జులాయిగా తిరుగుతున్న 15 ఏళ్ల బాలుడు బోర్ కొడుతుందని సరదాగా రాంగ్ కాల్ చేశాడు. అలా కాల్ చేస్తుండగా ఓ మహిళ ఫోన్ ఎత్తింది. అవతలి వైపు నుంచి ఆడగొంతు వినగానే ఈ పిల్లగానికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. మైకంలో తేలిపోతూ మాటల ప్రవాహాన్ని పెంచాడు. ఇద్దరికి మాటలు కోటలు దాటాయి. ప్రేమ దిశగా మారిపోయి ఒకరి వయసు ఒకరు తెలుసుకోలేదు.
ఇక ఇద్దరు ప్రేమ విషయం చెప్పుకొని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ బాలుడికి ఆ మహిత తన అడ్రసు చెప్పి ఇంటికి రావాలని కోరింది. బార్ పేట జిల్లాలోని సుఖావాజార్ లోని మహిళ ఇంటికి వెళ్లి ఆమెను చూసి ఆ బాలుడు అవాక్కయ్యాడు. ఆమె 60 ఏండ్ల ముసలామె. ఆ యువకుడికి మైండ్ బ్లాక్ అయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు వారిద్దరికి బలవంతంగా వివాహం జరిపించారు. ఆమె వయసు 60 ఏండ్లని తనకు తెలియదని అమ్మాయి అనుకున్నానని అబ్బాయి ఎంత మొత్తుకున్నా వినకుండా వారు ఆమెనిచ్చి అబ్బాయితో పెళ్లి జరిపించారు.
ఈ ఘటన మీడియాలో రావడంతో బాలల హక్కుల కమిషన్ స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందింతే చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైమైనా ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.