పుట్టగొడుగుల బిజినెస్ తో సులువుగా లక్షల్లో సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే

మనలో చాలామంది వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని భావించే వాళ్లకు పుట్టగొడుగుల బిజినెస్ మంచిదని చెప్పవచ్చు. బీహార్ కు చెందిన ఒక ఇంజనీర్ పుట్టగొడుగుల బిజినెస్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నాడు. తను డబ్బులు సంపాదించడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఈ వ్యక్తి వార్తల్లో నిలుస్తున్నాడు.

బీహార్‌ బెగుసరాయ్‌ ప్రాంతానికి చెందిన అమన్ కుమార్ అనే వ్యక్తి ఉద్యోగాన్ని వదిలేసి స్టార్టప్ బిజినెస్ తో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటున్నాడు. అమన్ కుమార్ తన తెలివితేటలతో ఈ వ్యాపారంలో సక్సెస్ సాధించారు. పుట్టగొడుగుల బిజినెస్ లో మంచి లాభాలను సొంతం చేసుకోవడంతో ఈ వ్యక్తి స్ట్రాబెరీ సాగును కూడా మొదలుపెట్టాడు.

బీహార్ కు చెందిన ఈ యువకుడు మూడు గదులను ఏర్పాటు చేసి పుట్టగొడుగుల బిజినెస్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయాన్ని పొందుతున్నాడు. నెలకు 5 లక్షల పుట్టగొడుగులను విక్రయిస్తూ ఉండటంతో ఇతనికి ఊహించని రేంజ్ లో లాభాలు దక్కుతున్నాయి. ఇతని దగ్గర పని చేస్తున్న కూలీలకు సైతం భారీ స్థాయిలోనే వేతనం లభిస్తోందని సమాచారం అందుతోంది.

తక్కువ పెట్టుబడితో లాభాలను సొంతం చేసుకోవాలని భావించే వాళ్లకు ఈ పుట్టగొడుగుల వ్యాపారం ద్వారా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఈ వ్యాపారం చేసేవాళ్లు ఈ వ్యాపారం గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి.