దేశం ఒక మహానేతను కోల్పోయింది. వాజ్‌పేయి మృతితో దేశ ప్రజలంతా దుఃఖంలో మునిగిపోయారు. రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక మహోన్నత మనిషిగా ఆయన ఎంతో ప్రజాదరణ పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారని తెలిసి చింతిస్తున్నారు. నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఆయన మృతి పట్ల ప్రతి ఒక్కరూ సంతాపం తెలుపుతున్న వేళ ఒక కార్పొరేటర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి చీవాట్లు, చెప్పు దెబ్బలు తిన్నాడు. మహారాష్ట్రలోని ఔరంగబాదులో ఈ ఘటన చోటు చేసుకుంది. వాజ్‌పేయికి సంతాపం ప్రకటించటానికి ఔరంగబాదు కార్పొరేటర్లు అందరూ సమావేశమయ్యారు. ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మతీన్ ఈ నివాళిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశాడు.
అతని చర్యకు కోపోద్రిక్తులైన మిగతా కార్పొరేటర్లు సయ్యద్ పై దాడి చేశారు. పురుష కార్పొరేటర్లు చేతి వాటం చూపిస్తే, మహిళా కార్పొరేటర్లు చెప్పు దెబ్బలు తినిపించారు. మేయర్ వద్దని వారించినా మహానేతపై వారికున్న అభిమానం వారి ఆవేశాన్ని కట్టడి చేయలేకపోయింది. పోలీసుల ఎంట్రీతో వ్యవహారం సర్దుమణిగింది. కింద ఉన్న వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు.