వాజ్‌పేయి అంతిమయాత్ర: టీవి9 ఏం చెప్పిందో చూడండి (వీడియో)

వాజ్‌పేయి అంతిమ యాత్ర లైవ్ ప్రసారం చేస్తున్న టీవీ 9 ఛానెల్ లో యాంకర్ చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాజ్‌పేయి కి బదులు అద్వానీ గారు వెళ్ళిపోతూ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు అని లైవ్ లో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తిని ప్రశ్నించింది యాంకర్.

ఆ వీడియో ఫోన్ లో రికార్డు చేసిన వ్యక్తులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు టీవీ 9 ఛానెల్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. tv9 ఫర్ బెటర్ సొసైటీ అంటే ఇలా తప్పు వార్తలు చదవడమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

బ్రతికి ఉన్న వ్యక్తులను చంపేస్తారా అంటూ మండి పడుతున్నారు. ప్రముఖ వ్యక్తుల గురించి న్యూస్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియదా అని ఆగ్రహిస్తున్నారు. కింద వైరల్ అయిన టీవీ 9  వీడియో ఉంది చూడవచ్చు.