మనిషి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుంది అనేది ఎవరు ఊహించలేరు. అనుకోని ప్రమాదాల వల్ల క్షణాల్లో జీవితాలు మలుపు తిరుగుతున్నాయి. కుటుంబంతో కలిసి సరదాగా నీటిలో ఆడుకోవటానికి వెళ్లిన వారి కుటుంబంలో తీరని శోకం మిగిలింది. ఈ విషాద ఘటన కేరళలోని అలపుజ్జా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడినుండి తిరుగు ప్రయాణమైన ఊరు దగ్గరలోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెల్లి సాయంత్రందాకా సరదాగా గడిపారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లి నీళ్లలోకి దిగి సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వరద సంభవించటంతో పిల్లలు పెద్దలు అందరూ చల్లాచెదరయ్యారు.
ఈ క్రమంలో అక్కడున్న వారందరూ నీటిలో కొట్టుకుపోగా ఎలాగోలా బయటపడ్డారు. అయితే అర్ష మాత్రం బయటికి రావడానికి వీలు లేకుండా చాలా దూరం నీటిలో కొట్టుకుపోయింది ఎలాగోలా స్థానికుల సహాయంతో ఆమెను భర్త నుండి కాపాడిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాల పాలైన అర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. చేతికందిన కూతురు కళ్ళముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు కూతురిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు.