బీహార్ లో దారుణం…మహిళకు ఆపరేషన్ చేసి పిండాన్ని కుక్కకి తినిపించిన వైద్యులు…?

ప్రజల ప్రాణాలు కాపాడే ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొంతమంది డాక్టర్లు డబ్బు కోసం ఆశపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా కొంతమంది నకిలీ డాక్టర్లు కూడా ఇలా ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇటీవల అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లిన గర్భవతి ప్రాణాలు కోల్పోయింది. అయితే నకిలీ డాక్టర్ల నిజస్వరూపం బయట పడుతుందనే భయంతో వారు ఆ మహిళకు ఆపరేషన్ చేసి పిండాన్ని కుక్కకు తినిపించిన ఘటన బీహార్ లో సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…బీహార్ లోని హాజీపూర్‌లో బలిగావ్ పరిధిలో ఇటీవల ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చంపాపూర్ అగ్రైల్ గ్రామానికి చెందిన మూడు నెలల గర్భిణికి ఇటీవల కడుపు నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల స్థానికంగా ఉన్న ఒక నర్సింగ్ హోమ్ కి వెళ్ళింది. ఆ మహిళను పరీక్షించిన వైద్యులు ఆమెకు అబార్షన్ (Abortion) చేసి పిండాన్ని బయటకు తీశారు. అయితే అబార్షన్ చేసిన కొద్ది సేపటికే యువతి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వైద్యులు తెలివిగా ఆలోచనలో చేసి కేసు తమ మీదకు రాకుండా యువతి పిండాన్ని తమ పెంపుడు కుక్కకు తినిపించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం యువతని కారణాల్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ యువతి చికిత్స పొందుతూ 11 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. అయితే యువతి మరణించిన విషయం తెలుసుకున్న డాక్టర్ దంపతులు ఉన్నపలంగా ఆసుపత్రికి తాళం వేసి అక్కడి నుండి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా యువతికి అబార్షన్ చేసిన ఆ డాక్టర్లు ఇద్దరూ నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్లుగా చలామణి అవుతున్నట్లు వెల్లడయ్యింది. ఈ క్రమంలో పోలీసులు నిందితులను పట్టుకోవడానికి రంగంలోకి దిగి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. డబ్బు కోసం డాక్టర్లుగా చలామణి అవుతున్న ఆ నకిలీ డాక్టర్లను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.