అమృత్ సర్ రైలు ప్రమాద డ్రైవర్ ఆత్మహత్య

అమృత్ సర్ లో ప్రమాదానికి గురైన రైలు నడిపిన లోకో పైలట్ అరవింద్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం రావణ దహనం జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ రైలు పట్టాల పైన ఉన్న వారి మీది నుంచి వెళ్లడంతో 60 మంది చనిపోయారు. తన తప్పు లేదని మానసిక వేదన చెంది అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. తాను చనిపోయే ముందు అరవింద్ రాసిన లేఖలో ఏముందంటే…

” మాకు రావణ దహనం జరుగుతున్న దాని పై ఎటువంటి సమాచారం లేదు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఎప్పటి లాగానే నిర్దిష్ట వేగంతో వెళ్లాను. అనుకోకుండా ఒక్కసారిగా జనాలు రైలు పట్టాలపై కనిపించడంతో హారన్ వాయిస్తూ వచ్చాను. ఆ సమయంలో ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేశాను. ట్రైన్ లో ప్రయాణించే 2 వేల మంది జనాల క్షేమం కోసం ఆలోచించి బ్రేకులు వేసేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేను హారన్ కొట్టినా జనాలు కదలలేదు. దాని వలన అనుకోకుండా తప్పు జరిగింది” అని అరవింద్ తన లేఖలో రాశారు.    కింద లింక్ పై క్లిక్ చేస్తే డ్రైవర్ రాసిన లేఖ వస్తుంది.