కర్నాటక ముఖ్యమంత్రయినప్పటినుంచి హెచ్ డి కుమార స్వామి టెన్షన్ లేకుండా గడిపిందేలేదు. మొదటేమో ఆపరేషన్ లోటస్ పేరు తో బిజెపి వాళ్లు కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను కొనేసి కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారేమోననే టెన్షన్.
ఆ తర్వాత కాంగ్రెసోళ్లు తనని గుమాస్తా చూస్తున్నారనే అనుమానంతో టెన్షన్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ కాంగ్రెస్ వాళ్లు కర్నాటక ముఖ్యమంత్రిని గుమాస్తా లాగా చూస్తున్నారు,’అన్ని అన్నప్పటినుంచి ఈ టెన్షన్ ఎక్కువయింది.
ఈ రెండు టెన్షన్ లు కొద్దిగా తగ్గినట్టు కనిపించినా, ఇపుడు మరొక టెన్షన్ మొదలయింది. ఇది నటి సుమలత నుంచి వస్తా వుంది. కుమారుడు నిఖిల్ ని ఆయన లోక్ సభకు పంపాలనుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్న తండ్రులందరికి ఉండే చిన్న కోరిక ఇదే కదా.
మాండ్య లోక్ సభ స్థానం నుంచి ఆయనను నిఖిల్ నిలబెడుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్య లోక్ సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా జెడిఎస్ సునాయాసంగా గెల్చుకుంది. అందువల్ల నిఖిల్ గెలుపు నల్లేరు మీద నడక అనుకుంటున్నారు.
మనవడిని ఎంపిగా చూడాలనుకుంటున్నటు కర్నాటక పెద్దాయన మాజీ ప్రధాని దేవేగౌడ ప్రకటించారు. నిఖిల్ చాలా కారణాలతో గెలవాల్సిన అవసరం ఉంది. కుమార స్వామి అన్న కొడుకు హసన్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించుకోవాలి. హసన్ సీటు గెలుస్తామనే ధీమా ఉంది. మాండ్యలో కూడా గెలుస్తామనుకున్నారు. అయితే, ఇపుడు నటి , ఇటీవల మరణించిన కాంగ్రెస్ మాజీ మంత్రి అంబరీష్ భార్య సుమలత అడ్డొస్తున్నది.
అంబరీష్ చురుకుగా రాజకీయాల్లో ఉన్నా సుమలత మాత్రం ఎపుడూ రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. అయితే, మూడు నెలల కిందట అంబరీష్ చనిపోయాక భర్త వారసత్వం కొనసాగించాలని అభిమానుల నుంచి వత్తిడి మొదలయింది. చాలా కాలం ఈ విషయం లో మౌనంగా ఉన్నా ఇపుడామె రాజకీయ ప్రవేశంమీద నిర్ణయం ప్రటించారు. పోటీ చేస్తానని బెదిరించారు.
కర్నాటకలో అంబరీష్ చాలా పేరున్న నటుడు. బలమయిన అభిమాన సంఘాల నెట్ వర్క్ కూడా ఉంది. అంబీరీష్ కావేరి జిలాలతో సుసంపన్నమయిన మాండ్య జిల్లాకు చెందిన వాడు. అక్కడి నుంచే లోక్ సభకు గెల్చాడు. అందుకే సుమలత కూడా మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.
అంబరీష్ మూడో మాసికం సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అభిమానుల వత్తిడికి తలొగ్గాల్సి వస్తున్నదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించకున్నట్లు చెప్పారు. ‘అంబరీష్ రాజకీయజీవితమంతా కాంగ్రెస్ లోనే సాగింది. మా మిత్రులు, బంధువులు కాంగ్రెస్ లో నే ఉన్నారు. అందువల్ల నేను కాంగ్రెస్ నుంచ పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే, సుమఖంగా లేదు. ఈ సీటుకోరి జెడిఎస్ తో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. అందువల్ల ఈ సీటు ఇవ్వడం కుదరదు ఏం చేసుకుంటావో చేసుకు పో అన్నారు.
దీనితో ఆగ్రహించిన సమలత లో క్ సభ ఎన్నికల్లో మాండ్య స్థానం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం నాడు లీడింగ్ సినీ నటులు దర్శన్, యాష్, తన కుమారుడ్ అభిషేక్ లతో కలసి ఆమె విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. మార్చి 20 న నామినేషన్ వేస్తున్నట్లు కూడా చెప్పారు.
కాంగ్రెస్ ఆమెకు బెంగుళూరు నార్త్, బెంగుళూరు సౌత్ నుంచి పోటీ చేసే అవకాశమిచ్చింది. అది ఇష్టం లేకపోతే ఎమ్మెల్సీ ని చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఆమె నో అనే శారు. ఈ మధ్యలో బిజెపి కూడా ఆమెకు ఎర వేసింది.
ఆమె తప్పించుకుని ఇంటిపెండెంటుగా పోటీ చేసేందుకే సుముఖత వ్యక్తం చేశారు.
గెల్చినా, ఓడినా, మాండ్యలో క్ సభస్థానమే నా గమ్యం అని ప్రకటించారు. కాంగ్రెస్ లలో జెడిఎస్ లలో గుబులు పుట్టించారు. ఎందుకంటే, ఆమె ఇండిపెండెంటుగా పోటీ చేయాలనుకోవడంతో బిజెపి కూడా ఆమెకు సహకరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె బిజెపి నాయకుడు, మాజీ కేంద్రమంత్రి ఎస్ ఎం కృష్ణ ను కలిశారు. ముందుచూపుతో బిజెపి ఆమెకు మరొక విధంగా మద్దతు నిచ్చే అవకాశం ఉంది.
కర్నాటక రాజ్య రైతు సంఘ నుంచి మద్దతు లభిస్తుందని ఆమె చెబుతున్నారు. తన నిర్ణయం సరైందని తెలుగు మెగా స్టార్ చిరంజీవి, తమిళ స్టార్ రజినీ కాంత్ కూడా ప్రశింసించారని కూడా ఆమె చెప్పారు.
ఈ లోపు ఆమెకు శాండల్ వుడ్ నుంచి మద్దతు కూడా లభించింది. అనేక మంది నటులు ఆమె కోసం క్యాంపెయిన్ చేయబోతున్నారు. దీనితో మాండ్య ఎన్నిక కలర్ ఫుల్ గా ఉండటమే కాదు, బాగా రక్తి కట్టబోతున్నదని అంటున్నారు.నిఖిల్ ఓటిమి కుమార స్వామి ఓటమి లాంటిదే. అందుకే అందరి కళ్లు మాండ్య మీద పడ్డాయి.
అంబరీష్ మీద ఉన్న అభిమానం, బిజెపి పరోక్ష మద్దతు, సినీ పరిశ్రమ మద్దతు … అన్ని కలిపి కుమార స్వామి చిన్న లక్ష్యం అదే కొడుకును లోక్ సభకు పంపించడం, నెరవేరకుండా పోతుందేమోనని ముఖ్యమంత్రి బెంగపడుతున్నారు. అందుకే కుమారస్వామి ఒక సైడు, ఆయన అన్న , మంత్రి రేవణ్ణ మరొక సైడు, సుమలత మీద, అంబరీష్ మీద వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని కర్నాటకలో బాగా వినబడుతూ ఉంది.