ఆ హీరోలకి పెద్ద అభిమానిని.. తన ఫేవరెట్ హీరోలెవరో చెప్పేసిన యశ్?

కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యశ్ కే జి ఎఫ్ ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. కే జి ఎఫ్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు పొందిన యశ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సినిమాల గురించి తన అభిమాన హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరగానని తెలిపారు.

ఈ విధంగా చిన్నప్పటినుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండటం వల్ల రాఖీ బాయ్ పాత్ర నాది అని నేను చెప్పలేను నేను ఏ పాత్రలో చేయాలి అనుకుంటే ఆ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాను. ఒక జర్నలిస్టు పాత్రలో చేయాల్సి వస్తే అతని గురించి అన్ని విషయాలు తెలుసుకుని అలాంటి పాత్రలలో నటించడానికి సిద్ధమవుతాను. ఇక నటన పరంగా నాకు ఎంతోమంది రోల్ మోడల్స్ ఉన్నారని తెలిపారు.

శంకర్‌ నాగ్‌, అంబరీష్‌, రాజ్‌కుమార్‌, అమితాబ్‌ బచ్చన్ రజనీకాంత్ ,కమల్‌హాసన్‌ వంటి హీరోలకు తాను వీరాభిమానినని వీరంతా తన అభిమాన హీరోలంటూ ఈయన చెప్పడమే కాకుండా వీరిలో రజనీకాంత్ తననీ ఎంతో ప్రభావితం చేశారని, ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని యశ్ కేజిఎఫ్ 2 సినిమా విడుదల కాకముందు కూడా ఓ సందర్భంలో తన అభిమాన హీరోల గురించి మాట్లాడుతూ కమల్‌ హాసన్‌ నటన భగవద్గీత, రజనీకాంత్‌ సర్‌ నాకు దేవుడు.. ఆయన మా తలైవా” అని చెప్పిన విషయం తెలిసిందే.