సుమలత నాగార్జునను కాదని అంబారీష్ ను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదేనా?

సుమలత ఒక భారతీయ నటి, రాజకీయ నాయకురాలు. ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపుగా 220కి పైగా సినిమాలలో నటించింది. ఈమె తెలుగు ఇంకా మలయాళ ఇండస్ట్రీలో ప్రజాదారణ పొంది మంచి గుర్తింపు పొందింది.

తరువాత కన్నడ నటుడు అంబారిష్ ను వివాహం చేసుకుంది. ఈమె 1979లో ఆంధ్ర ప్రదేశ్ అందాల పోటీలలో గెలిచిన తర్వాత, 15 సంవత్సరాల నుండి నటించడం ప్రారంభించింది. ఆమె చిత్రాలను పత్రికలలో ప్రసారం కావడం ద్వారా డి. రామానాయుడు ఆమెను తన చిత్రంలో నటింప చేయుటకు ఆసక్తి వ్యక్తం చేయడం ద్వారా సినిమా రంగం వైపు రావడం జరిగింది.

సమాజానికి సవాల్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఈ సినిమా కంటే ముందే తమిళంలో నటించిన తిసై మరియా పరపైగల్ అనే సినిమా విడుదల కావడం జరిగింది. ఇలా వరుస సినిమాలతో తనదైన శైలిలో ముందుకు సాగుతూ దక్షిణ భారతదేశంలోనే అగ్ర కథానాయికలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.

ఇక అసలు విషయానికి వస్తే సుమలత కెరీర్లో బిజీగా రాణిస్తున్న సమయంలో అక్కినేని నాగేశ్వరావు గారు.. సుమలతతో ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు.. పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఎవరని ఆమె అడిగిందట. అప్పుడు ఆయన తన కొడుకు నాగార్జున అని చెప్పడంతో, ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయిందట.

ఇక అక్కినేని నాగార్జున గారు.. డి. రామనాయుడు కుమార్తెను ప్రేమించి విదేశాల నుండి తిరిగి రావడంతో అక్కినేని నాగేశ్వరరావు గారు వీరి ప్రేమను ఒప్పుకొని, వివాహం జరిపించారు. ఇక మరొకవైపు అంబారీష్ ను ప్రేమించి వివాహం చేసుకుంది సుమలత.

సుమలత 2019 ఎన్నికలలో పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య లోకసభ నియోజకవర్గంలో నుండి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం రాజకీయాలపరంగా ప్రజలకు సేవలు అందిస్తుంది.