దేశాన్ని రక్షించే పోలీసుల పట్ల ప్రజలకు ఎంతో గౌరవం ఉంటుంది. కానీ అటువంటి గౌరవపాదమైన వృత్తిలో ఉన్నప్పటికీ కొంతమంది పోలీసులు మానవత్వం మరిచిపోయి చట్టాలను కాపాడకపోగా చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారు అంతేకాక మహిళలకు అండగా నిలవాల్సిన పోలీసులు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్నాక పోలీసు అధికారి అర్ధరాత్రి సమయంలో నడిరోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్న ఒక యువతి పట్ల ప్రవర్తించిన తీరు ఆగ్రహానికి గురిచేస్తోంది.
వివరాలలోకి వెళితే..భోపాల్‌కు చెందిన పుష్పేంద్ర జాడోన్ అనే కానిస్టేబుల్ డ్యూటీలో ఉండగానే ఫుల్లుగా మద్యం సేవించి హనుమాన్గంజత్ ప్రాంతంలో సుమారు 11 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న యువతిని అడ్డుకొని ఆమెను లైంగికంగా వేధించాడు. యువతి ప్రైవేట్ పార్ట్స్ తాగుతూ పైసాచికంగా ప్రవర్తించడమే కాకుండా అసభ్యకరమైన పదజాలంతో యువతిని దూషించాడు. పోలీస్ అధికారి ఇలా చేయడంతో యువతి ఎలా స్పందించాలో తెలియక అతని చెర నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆమెను వదలకుండా కానిస్టేబుల్ వేధించాడు. చివరికి ఎలాగో అయోవతి కానిస్టేబుల్ చర్ నుండి తప్పించుకుంది.
ఈ మొత్తం ఘటనను స్థానికంగా ఉన్న కొందరి యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. యువకులు ఈ ఘటనను అడ్డుకోకుండా ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం యువతి కానిస్టుబుల్పై కంప్లైట్ ఇచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు సీరియస్ అయిన పోలీసులు పుష్పేందర్‌ను స్పెండ్ చేశారు.
మధ్య ప్రదేశ్‌లో దారుణం
భోపాల్ – రోడ్ మీద వెళుతున్న స్కూల్ విద్యార్థినిని లైంగికంగా వేదించిన పోలీస్. వీడియో వైరల్ కావడంతో సస్పెండ్ చేసిన పోలీసులు.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/4XG3hncWYh
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2023