సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో తల్లి లేదా తల్లి మరణించడం వల్ల పిల్లలు అనాధలుగా మారుతున్నారు. అయితే తండ్రికి దూరమైన పిల్లలు తల్లిదగ్గర ఎటువంటి కష్టాలు లేకుండా పెరిగినప్పటికీ.. తల్లి లేకపోతే మాత్రం ఆ పిల్లల జీవితం అగమ్యగోచరంగా తయారవుతుంది. హరే చనిపోతే పిల్లలకి తల్లి ప్రేమ కోసం ఎంతోమంది రెండవ పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారు ఆ పిల్లలను ప్రేమగా కాకుండా సవతి పిల్లల లాగే చూస్తున్నారు. ఇటీవల కూడా ఒక సవతి తల్లి పెట్టే బాధలకు ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రి పాలైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ కి చెందిన ఇస్రార్ అనే వ్యక్తి మొదటి భార్య మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే తన కూతురికి తల్లి ప్రేమ అందించాలనే భావనతో ఇస్రార్ రెండేళ్ల క్రితం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు ఆమె ఆ చిన్నారిని బాగానే చూసుకుంది. ఆ తర్వాత భర్త ఉండగా కూతుర్ని బాగానే చూసుకున్నట్లు నటిస్తూ అతను బయటికి వెళ్ళిన తర్వాత పాప ని చిత్రహింసలు పెట్టేది. ఇక ఇటీవల నాలుగు నెలల క్రితం ఆమె మగబిడ్డకు జన్మనివ్వటంతో బాలికకు చిత్రహింసలు మరింత పెరిగాయి. గత కొంతకాలంగా కూతురు అనారోగ్యంగా ఉండటం ఇస్రాన్ గమనించాడు.
మూడు రోజుల క్రితం ఇస్రాన్ ఇంటికి వచ్చేటప్పటికీ ఆ చిన్నారి దిగులుగా కూర్చుని ఉండటంతో దగ్గరకు వెళ్లి చూస్తే ముఖం, గొంతుపై గోళ్లతో గీసిన గుర్తులు ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పాదాలు కూడా వాచిపోయి ఉన్నాయి. దీంతో కూతురిని ప్రశ్నించగా.. సవతి తల్లి తనను కొడుతోందని ఆ చిన్నారి తన తండ్రికి చెప్పింది. అంతేకాకుండా కొట్టిన విషయం తండ్రికి చెబితే చంపేస్తానని బెదిరించిందని చిన్నారి తన తండ్రికి చెప్పింది. గాయాలతో ఉన్న తన కూతురిని ఇస్రాన్ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాడు. అంతేకాకుండా తన కూతురిని హింసించిన రెండవ భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాడు.