ఈ మధ్య కాలంలో చాలామంది అత్యవసరాలు ఉన్న సమయంలో రుణాలపై ఆధారపడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైందనె సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు పుంజుకుంటున్నా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మళ్లీ ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. చిరు వ్యాపారులు ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా పుంజుకుంటున్నారు.
వీళ్లకు ప్రయోజనం చేకూరేలా మోదీ సర్కార్ ప్రధానమంత్రి స్వానిధి పథకంను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వాళ్లకు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు రుణం మంజూరవుతుంది. ఎలాంటి గ్యారంటీ అవసరం లేకుండా ఈ రుణాన్ని పొందవచ్చు. చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం కావడం గమనార్హం. మొదట తక్కువ మొత్తం రుణం మంజూరు అవుతుంది.
ఆ మొత్తాన్ని చెల్లిస్తే ఎక్కువ మొత్తం రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. వ్యాపారులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ స్కీమ్ ద్వారా 50,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆ తర్వాత మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సక్సెస్ ఫుల్ గా వెరిఫై చేయించుకుని వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు నుంచి ఖాతాలో నగదు జమ కావడం జరుగుతుంది. చిరు వ్యాపారులు ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.