మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిస్తూ బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. రూ 5 లక్షల వరకు ఆదాయపన్నును ఎత్తివేస్తున్నట్టు పీయూష్ గోయల్ ప్రకటించారు. దీంతో 3 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరునుంది. ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను ఉండదు. ఎన్నికలకు ముందు బిజెపి ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల పై వరాలు ప్రకటించదని బిజెపి నేతలన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ ను 50 వేల రూపాయలకు పెంచారు. దీని ద్వారా ఉద్యోగులకు పించన్ దారులకు కూడా ఊరట లభించింది.
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పని చేసే వారికి కూడా పన్ను మినహాయింపునిచ్చారు. ప్రావిడెండ్ ఫండ్ లో పెట్టుబడులు పెడితే 6.5 శాతం వరకు పన్ను మినహాయింపు లభించనుంది. పార్లమెంటులో మంత్రి ప్రకటన తర్వాత బిజెపి నేతలు హర్షద్వానాలు చేశారు.
రూ. 5 నుంచి 10 లక్షల ఆదాయం వరకు 20 శాతం, రూ. 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్నుగా శ్లాబ్ నిర్ణయించారు. సేవింగ్స్ పై 40 వేల వరకు పన్ను మినహాయించారు.
- ఎన్నికల ముందు వేతన జీవులకు భారీ ఊరట
- రూ.5లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు
- ఇప్పటివరకు ఇస్తున్న పన్ను మినహాయింపు రెట్టింపు
- గృహరుణాలు, ఇంటిఅద్దెలు,. ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు.
- 3 కోట్ల ఉద్యోగులకు లబ్ది
- స్టాండర్డ్ డిడక‌్షన్ రూ.50 వేలకు పెంపు
- పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంపు
- నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ ఉండదు.
- సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్నులేదు.