రేషన్ కార్డు ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన వార్త. ఇంకా మీరు మీ రేషన్ కార్డుకు ఈ-కేవైసీ (e-KYC) చేయించుకోలేదా.. అయితే వెంటనే పూర్తి చేయండి. ఎందుకంటే, జూన్ 30 తర్వాత ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు చాలా పట్టణ ప్రాంతాల రేషన్ కార్డుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, పలు డివిజన్లలో లక్షల మంది లబ్ధిదారులు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇకపై అనర్హుల పేర్లను తీసివేసి, అర్హులకే ధాన్యాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇక నుంచి రేషన్ డీలర్ ద్వారా లేదా ఇంటి నుంచే ఈ-కేవైసీ చేయవచ్చు. ఇంటి నుంచే చేయాలంటే My KYC యాప్, ఆధార్ ఫేస్ RD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈకేవైసీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే:
ముందుగా My KYC, ఆధార్ ఫేస్ RD యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి.
యాప్ ఓపెన్ చేసి రాష్ట్రం, లొకేషన్ సెలెక్ట్ చేయాలి.
ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్‌కి వచ్చే OTP ఇవ్వాలి.
డిటేల్స్ స్క్రీన్‌పై వస్తాయి.
ఫేస్ స్కాన్ కోసం ఫేస్ eKYC ఆప్షన్ ఎంచుకుని మొబైల్ కెమెరాతో ఫోటో స్కాన్ చేయాలి.
దీంతో ఈ-కేవైసీ పూర్తి.. అవుతుంది..
ప్రభుత్వం ఇప్పటికే కేవైసీకి చాలా గడువులు ఇచ్చింది. కానీ ఇప్పుడు జూన్ 30తోనే గడువు చివరిది కాబోతోంది. అప్పటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఫ్రీ రేషన్ రాదు. కాబట్టి ఆలస్యమేయకుండా వెంటనే మీ రేషన్ డీలర్ ద్వారా లేదా ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి. రేషన్ పథకం ప్రయోజనాలు పొందేందుకు ఇది తప్పనిసరి.