ప్రస్తుత కాలంలో ఎన్నో పథకాలు అమలవుతుండగా ఈ పథకాలలో మెజారిటీ పథకాలకు అర్హత పొందడానికి ఎంతో ముఖ్యమైన గుర్తింపు కార్డులలో రేషన్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. రేషన్ కార్డ్ లో పేర్లు ఉంటే మాత్రమే ఎన్నో స్కీమ్స్ కు అర్హత పొందే ఛాన్స్ ఉండగా రేషన్ కార్డ్ లో పిల్లల పేర్లను యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం వన్ నేషన్ వన్ రేషన్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది.
రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు రేషన్ పొందే అవకాశం అయితే ఉండగా కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఇతర నిత్యావసర వస్తువులు పొందే అవకాశం ఉంటుంది. దారిద్ర్య రేఖకు దిగువన్న ఉన్నవాళ్లు మాత్రమే రేషన్ కార్డ్ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. మరో రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త రేషన్ కార్డుల మంజూరు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
ఆన్ లైన్ ప్రాసెస్ ద్వారా పెళ్లైన వాళ్లు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డ్ లో చేర్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాష్ట్ర ఆహార సరఫరా శాఖ వెబ్‌సైట్ సహాయంతో సులువుగానే పిల్లల పేర్లను యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ పెద్ద ఆధార్ కార్డ్, అవసరమైన ధృవీకరణ పత్రాలను జత చేయడం ద్వారా పేర్లను యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
కొత్త రేషన్ కార్డ్ ను పొందాలని భావించే వాళ్లు సైతం ఈ ప్రాసెస్ ద్వారా సులువుగానే కొత్త రేషన్ కార్డ్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. అర్హత ఉన్నవాళ్లు రేషన్ కార్డ్ లేకపోతే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.