ఆధార్, రేషన్ కార్డ్ ఉన్న మహిళలకు అదిరిపోయే తీపికబురు.. బ్యాంక్ ప్రకటన ఇదే!

ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఉన్న మహిళలకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే తీపికబురు అందించింది. తాజాగా బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించగా ఈ బంపర్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే మహిళలకు ఎంతో లాభమని చెప్పవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఫ్రీగా బ్యూటీ పార్లర్ కోర్స్ లో శిక్షణ ఇస్తున్నారు.

వేర్వేరు రంగాల్లో మహిళలు రాణించడానికి ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బ్యూటీ పార్లర్లకు డిమాండ్ పెరుగుతోంది. బ్యూటీ పార్లర్ నేర్చుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. జూన్ నెల 19వ తేదీన ఈ శిక్షణ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది.

ఈ శిక్షణ తీసుకునే మహిళా అభ్యర్థులకు ఫ్రీగా ట్రైనింగ్ తో పాటు భోజన సదుపాయం కూడా కల్పించనున్నారని సమాచారం అందుతోంది. 90007 10508 ఫోన్ నంబర్ ను సంప్రదించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కల్లూరు పట్టణంలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో ఫోటోలు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాల్సి ఉంటుంది.

తక్కువ సమయంలో కెరీర్ పరంగా సెటిల్ కావాలని భావించే వాళ్లకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. బ్యూటీపార్లర్ శిక్షణ తీసుకోవడం ద్వారా మేకప్ కోసం ఎలాంటి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు.