జాగ్రత్తలు తీసుకున్నా గ్యారంటీ లేదు !

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకి ముగింపు ఎప్పుడనేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్తుతుల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఇంకా మనలో చాలామందికి కరోనా గురించి కనీస అవగాహన కూడా ఉండట్లేదు. అసలు కరోనా సోకినపుడు రోగికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి ? కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని పై ఇప్పటికీ కూడా పల్లెల్లో సరైన అవగాహన లేదు. ఆ మాటకొస్తే చదువుకున్న వారికీ కూడా కరోనా లక్షణాలపై పూర్తి క్లారిటీ లేదేమోనని అనుమానాలు కలుగుతున్నాయి.

అలాగే వైద్యులకు సైతం కరోనా వైరస్ పుట్టుక, లక్షణాలపై సరైన అవగాహన లేకుండానే చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తమ ప్రాణాలను పణంగాపెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదైన తర్వాత గాలి ద్వారా కూడా కరోనా సోకుతుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకపక్క కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు నిరంతరం శ్రమిస్తున్నా… వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తుండటంతో వ్యాక్సిన్ తయారీ అయోమయ స్థితిలో ఉంది.

అయితే రేయింబవళ్లు సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నారు. వాక్సిన్ ప్రయోగాలు సత్ఫలిస్తున్న తరుణంలో రోజుకో వైరస్ లక్షణం బయటపడటం ఆందోళన రేపుతోంది. కానీ, గాలి ద్వారా కరోనా సోకుతుందని నిర్ధారణ కావడంతో తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి రావడంతో ప్రజలు బయటకొచ్చి పనులు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఏది ఏమైనా కరోనా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మరి బారినపడకుండా ఉంటామని గ్యారింటి లేదు.