కరుణానిధి ఒక పేద ఇసాయి వెల్లలార్ (ఒక బీసీ కులం) కుటుంబంలో జూన్ 3, 1924 లో పూర్వపు తంజావూరు జిల్లాలోని తిరుక్కువలై అనే చిన్న పల్లెటూళ్ళో జన్మించారు. తన తల్లిదండ్రులు ముతువెల్ మరియు అంజుగం తముకున్న దైవభక్తి చేత కరుణానిధి కి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు .
యుక్త వయస్సులో పెరియార్ రామస్వామి మరియు అన్న నేతృత్వంలోని ద్రావిడ ఉద్యమం పట్ల ఆకర్షితుడై ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడం ప్రారంభించిన తర్వాత దక్షిణామూర్తి బ్రాహ్మణ పేరు లాగా వుందని, తన పేరుని కరుణానిధిగా మార్చుకున్నాడు.
తమిళనాడులో ద్రావిడ ఉద్యమానికి మరియు డిఎంకె పెరుగుదలకి ప్రధాన పాత్ర పోషించిన కళ, సాహిత్యం, ఫ్యాషన్ థియేటర్ మరియు సినిమాల్లో కరుణానిధి చూపిన నైపుణ్యానికి “కళైజ్ఞర్” అనే బిరుద కూడా తన సొంతం అయ్యింది .