కరోనా మహమ్మారితో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని కేసీఆర్ ఆరాట పడుతున్నారు. ఈ విషయంలో అధికారులను కూడా ఇప్పటికే ఆదేశించారు. అయితే కరోనా వ్యాప్తితో ప్రపంచమే అల్లాడిపోతోంది. నివారణ చర్యలు తీసుకుంటూ ముందుకుపోతే కరోనా కంట్రోల్ అవ్వదు అని పరాయి దేశాల అనుభవం చెబుతుంది. మరి అన్ని పనులు మానుకుని ఇంట్లోనే కూర్చుకోవాలా అంటే.. కష్టమే. ఇంకా కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి, కాబట్టి కరోనా ఉన్నా మన జీవితం సాఫీగా సాగాలంటే ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరం.
ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అంశాల పైనే సమీక్షలు నిర్వహిస్తూ కాలం కరిగించకుండా కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వైరస్ వచ్చిన వారికి అత్యుత్తమ సేవలు అందాలి. అందిస్తున్నాం అని నాయకులు చెబుతున్నా.. కాంటాక్ట్ వ్యక్తుల పరీక్షలు జరుగుతున్నాయా ? ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారా..? తీసుకుంటే, హైదరాబాద్ లో వైరస్ మళ్లీ ఎందుకు విజృభిస్తోంది ? ఇప్పటికి కూడా హైదరాబద్ లో వైరస్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
హైదరాబాద్ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలో కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రజలను జాగ్రత్తలు పాటించమని చెబితే సరిపోదు. ప్రజలు పాటించేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే కరోనాను కొంతవరకైనా నివారించగల్గుతాం. అదే కరోనాతో కలిసి జీవించే వ్యూహం కూడా అవుతుంది.