ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..? అధిక వడ్డీ పొందే అద్భుత ఆఫర్లు..!

కస్టమర్లకు ఉత్తమ సేవలు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐ ఖాతాదారులకు అధిక వడ్డీ పొందే అవకాశాన్ని బ్యాంక్ కల్పించింది. పెన్షనర్లు, ఎఫ్ డీ అకౌంట్ కస్టమర్లు, ఉద్యోగస్తులు అధిక శాతం వడ్డీ పొందే అవకాశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించి అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 15, 2022 నుండి కొత్త వడ్డీ శాతాలు అమలులోకి వచ్చాయి. పెన్షనర్లు ఇప్పుడు 5 నుండి 10 సంవత్సరాల కాలంలో 7.65% వడ్డీని పొందే అవకాశాన్ని బ్యాంక్ కల్పించింది. ఎఫ్ డి రేట్ల సవరణ తర్వాత సీనియర్ సిటిజెన్లకు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు వడ్డీ రేటు 6.65% కి పెరిగింది. అయితే సాధారణ ప్రజలకు మాత్రం మూడు శాతం నుండి 5.85 శాతానికి వడ్డీ రేటు పెరిగింది. అంతేకాకుండా ఎఫ్ డి వడ్డీరేట్లు 10 నుండి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

ఎఫ్ డీ వడ్డీ రేటు ఏడు రోజులకు 2.90 శాతం నుండి 3 శాతానికి పెరగగా… 46 రోజుల నుంచి 179 రోజులకు గాను నాలుగు శాతానికి వెళ్ళింది. ఇక 180 నుంచి 210 రోజులకు గాను 4.65 శాతానికి పెరిగింది.ఇక ఫిక్సెడ్ డిపాజిట్లకు వడ్డీ రేటును 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ నుండి 4.70 శాతానికి తగ్గించారు. ఇక ఏడాది నుండి రెండేళ్ల లోపు వాటికి 5.45 శాతం నుండి 5.60 శాతానికి పెంచారు. రెండేళ్ల నుండి మూడేళ్లకు 5.65 శాతం వడ్డీ ఇస్తున్నారు. మూడు నుండి ఐదేళ్లకు 5.80 శాతానికి పెరిగింది. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు వడ్డీ 5.85 శాతానికి పెంచేశారు.