Bimbisara Telugu movie review : రివ్యూ – ‘బింబిసార’

Bimbisara Movie Review

Bimbisara Telugu Movie Review

నటీనటులు : కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సా , వరినా హుస్సేన్ తదితరులు.

దర్శకుడు : వశిష్ట

స్క్రీన్ ప్లే : వశిష్ట

కెమెరా మెన్ : చోటా కె నాయుడు

ఎడిటర్ : తమ్మిరాజు

నిర్మాత : హరి, కళ్యాణ్ రామ్.

నందమూరి కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా బడ్జెట్ తో రిస్క్ చేసి మరి చేసిన సినిమా బింబిసార. నేడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా తీసుకొచ్చారు. మరి ఈ సినిమా పరిస్థితి ఏమిటి ?, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయా? లేదా ? రివ్యూ చూద్దాం రండి.

కథ :

చారిత్రక పాత్రను కల్పిత కథనంతో ఈ చిత్ర కథ మొదలైంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ రెండు నేపథ్యాలతో ఈ చిత్ర కథనం సాగింది. త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు (కళ్యాణ్ రామ్) క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం గొప్ప రాజు. ప్రపంచాన్ని జయించాలని అందుకు గానూ రాజ్యాల పై యుద్దానికి సిద్దం అవుతాడు బింబిసారా. అలాగే మరో టైమ్ లైన్ లో ప్రస్తుత ప్రపంచంలోకి వస్తే.. ఒక వ్యక్తి అచ్చం బింబిసారుడిలా ఉంటాడు. అయితే, కొంత మంది దుండగులు ఎలాంటి కారణం లేకుండా అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు ?, ఇతనికీ బింబిసారాకు ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు ఈ వ్యక్తి బింబిసారా నిధిని తెరవగలిగాడా ?, లేదా ? అసలు బింబిసారా కథ ఎలా ముగిసింది ?, అతని కాంక్ష ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

విశ్లేషణ :

భారీ హిట్ కోసం పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కెరీర్ ను ఈ సినిమా కొత్త మలుపు తిప్పింది అంటూ రిలీజ్ కి ముందే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమాలో ఆ బజ్ కి తగ్గ అవుట్ ఫుట్ లేదు. బింబిసార గురించి సింపుల్ గా చెప్పాలంటే.. సినిమాలో సోషల్ మెసేజ్ బాగున్నా.. సోల్ మిస్ అయ్యింది. కళ్యాణ్ రామ్ – హీరోయిన్ల పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉన్నా.. ఎమోషన్ మిస్ అయ్యింది. దీనికితోడు మా సినిమా అద్భుతం అంటూ ఈ సినిమా పై కళ్యాణ్ రామ్ పెంచిన భారీ అంచనాలు కూడా ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ అయ్యింది.

కళ్యాణ్ రామ్ సినిమా గురించి చెప్పిన మాటలకు, సినిమాలోని, సాంకేతిక వర్గం పనితనానికి పొంతన లేదు. భారీ బడ్జెట్ తో రూపొందింది అని పేరే గానీ, సినిమాలో ఆ భారీతనం కనిపించలేదు. సహజంగా తీయాలనే తాపత్రయంలో గ్రాండ్ విజువల్స్ ను కూడా రొటీన్ చేసి పారేశారు. పైగా ఒక్క క్లైమాక్స్ కి తప్ప ఇక దేనికి బడ్జెట్ పెట్టలేదు. బింబిసార మొదలైన మొదటి నిమిషం నుంచి నందమూరి అభిమానులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. వారికి ఎక్కడా ఛాన్స్ దొరకలేదు.

కానీ ప్రతి పది సీన్స్ కి ఒక భారీ ఎలివేషన్ సీన్ ఉంటుంది. విలన్ బ్యాచ్ గాల్లో తేలుతూ ఉంటారు. కళ్యాణ్ రామ్ బిల్డప్ షాట్స్ పడుతూ ఉంటాయి. ఇవ్వన్నీ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు. ఓవరాల్ గా బింబిసార సినిమా చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కళ్యాణ్ రామ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అలాగే హీరోయిన్స్ సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సాల నటన చాలా బాగుంది. తమ పాత్రల్లో వాళ్ళు ఒదిగిపోయారు. మొత్తమ్మీద ఈ చిత్రం గ్రాఫిక్స్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. పీరియాడిక్ అండ్ యాక్షన్ డ్రామా’ గా సాగుతూ ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజెన్స్

హీరోయిన్ల సంయుక్త మీనన్, కేథరిన్ థెరెసా గ్లామర్

భారీ యాక్షన్ విజువల్స్

మైనస్ పాయింట్స్ :

లాజిక్ లెస్ పీరియాడిక్ డ్రామా

స్లో నేరేషన్

బోరింగ్ స్క్రీన్ ప్లే

సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం

బలహీనమైన స్క్రిప్ట్

తీర్పు :

కళ్యాణ్ రామ్ బింబిసార అంటూ ప్యూర్ పీరియాడిక్ అండ్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన అండ్ కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ బాగున్నాయి. అలాగే మెయిన్ పాయింట్ లోని మెయిన్ కంటెంట్ బాగుంది, కానీ, మిగిలిన బాగోతం అంతా రొటీన్ గానే సాగింది. మేకింగ్ స్టైల్ తో పాటు బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాలతో ఈ సినిమా నిరాశ పరిచింది. ఓవరాల్ గా అంచాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం నందమూరి అభిమానులకు మాత్రం నచ్చుతుంది.

రేటింగ్ : 2.75 / 5