ఇది శర్వ బ్యాంగ్ – ‘రణరంగం’ టీజర్ రిలీజ్!

శర్వానంద్‌, సుధీర్‌వర్మల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రణ రంగం’ టీజర్ ఈ సాయంత్రం విడుదలైంది. పీరియడ్ -కం- న్యూ ఏజ్ గ్యాంగ్ స్టర్ మూవీగా తీస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ మంచి క్వాలిటీతో చాలా స్టయిలిష్ మేకింగ్ తో వుంది. గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ ని యాక్షన్ లో చూపిస్తూ, కొందరికి క్రిమినల్- కొందరికి హీరో అని చూపించారు. ‘దేవుణ్ణి నమ్మాలంటే భక్తి వుంటే సరిపోతుంది, కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’ అన్న శర్వ డైలాగు బేస్ గా విజువల్స్ వస్తాయి. తుపాకీ కాల్పులు, ప్రత్యర్ధుల చావులు మోడరన్ బ్యాక్ డ్రాప్ లో పూర్తయ్యాక, 1990 లలో ఏం జరిగిందో పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ షాట్స్ వస్తాయి. మంచి బ్యాంగ్ తో ఎండ్ అవుతుంది. మధ్యలో హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ తో రోమాన్స్.

గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వచ్చాయి. ఇదెలా భిన్నంగా వుంటుందో చూడాలి. దర్శకుడు సుధీర్ వర్మ ‘స్వామీరారా’ తో అనే గ్యాంగ్ స్టర్ మూవీతోనే రంగప్రవేశం చేశాడు, కాకపోతే ఇది మంచి కామెడీ థ్రిల్లర్. చిత్రీకరణలో ‘పల్ప్ ఫిక్షన్’ కి ప్రభావితుడైనట్టు చాలా క్రియేటివిటీ ప్రదర్శించాడు. ప్రస్తుత గ్యాంగ్ స్టర్ దీనికి భిన్నంగా కన్పిస్తోంది. స్వామీ రారా విజయం తర్వాత ‘దోచేయ్’, ‘కేశవ’ అనే రెండు అపజయాలెదుర్కొన్న తర్వాత రెండేళ్ళకి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న పట్టుదలతో వున్నట్టు టీజర్ లో మేకింగ్ కన్పిస్తోంది. ఇక కంటెంట్ మీదే సక్సెస్ ఆధారపడింది.

శర్వానంద్, కళ్యాణీ ప్రియదర్శన్ లతోబాటు, అందాల భామ కాజల్ అగర్వాల్ ఒక పాత్ర నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చింది. ఆగస్టులో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=AEHC5KaxXK4