అనుపమ పరమేశ్వరన్ చేతిలో ఆ ఒక్క సినిమా మాత్రమే .. తేడా కొడితే..?

అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరసగా నాని, రాం, నితిన్, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. మంచి హిట్స్ కూడా అందుకుంది. అయితే బ్లాక్ బస్టర్స్ అందుకోవడంలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ వెనకబడింది. ఇదే సమయంలో టాలీవుడ్ కి రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ వచ్చి పోటీ ఇవ్వడంతో అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు దాదాపుగా తగ్గిపోయాయి. కొన్ని సినిమాలలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

Anupama-Parameswaran-Has-Only-That-One-Movie-In-Her-Hand
anupama-parameswaran-has-only-that-one-movie-in-her-hand

కాని ఆ వెంటనే అది రూమర్ అంటూ మరో వార్త వస్తోంది. ఇలా అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ప్రస్తుతం నత్తనడకగా సాగుతోంది. మహా సముద్రం సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తీరా చూస్తే ఈ సినిమాలో అదిథి రావు హైదరీ.. అనూ ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా ఫైనల్ అయ్యారు. ఇలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో కూడా జరిగింది. ఎట్టకేలకి నిఖిల్ సిద్దార్థ్ కి జంటగా 18 పేజెస్ అన్న సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ .. ప్రస్తుతం ఈ సినిమా మీదే తన ఆశలన్ని పెట్టుకుంది.

ఈ ఒక్క సినిమానే అనుపమ పరమేశ్వరన్ చేతిలో ఉంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తుండటం విశేషం. కుమారి 21 ఎఫ్ అన్న సినిమాతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ మంచి హిట్ అందుకున్నాడు. అదే నంబర్ సెంటిమెంట్ వచ్చేలా ఈ సినిమాకి 18 పేజెస్ అన్న టైటిల్ పెట్టారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమా హిట్ అయితే అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో సెటిలవుతుంది. లేదంటే ఇక అంతే అంటున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles