శర్వానంద్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్ ..ఫొటోస్ వైరల్ ‌

టాలీవుడ్ మెగాస్టార్ తనయడు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, సినీ కెరియర్ మొదటి నుండి విభిన్నమైన కథలతో సినిమాలు చేసే యంగ్ హీరో శర్వానంద్ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు పలు ఈవెంట్స్‌లో కలిసి సందడి చేసారు. ఈ రోజు శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా రామ్ చరణ్‌ శర్వాకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను హ్యాండ్సమ్ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ చరణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. రామ్ చరణ్ రీసెంట్‌గా ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌కు వచ్చారు. ఆచార్య చిత్రంలో చరణ్ విద్యార్ధి నాయకుడిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇక శర్వానంద్ విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీకారం, మహా సముద్రం చిత్రాలతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలతో బిజీగా ఉన్నాడు.

టాలీవుడ్‌లో భిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో శ‌ర్వానంద్. ఈ హీరోకి అభిమాన గ‌ణం బాగానే ఉంది. కెరీర్‌లో 20కు పైగా సినిమాలు చేసిన శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం శ్రీకారం, మ‌హా స‌ముద్రంతో పాటు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేస్తున్నాడు. శ్రీకారం చిత్రం కిశోర్ బి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మార్చి 11న శివ‌రాత్రి కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కత్వంలో మ‌హా స‌ముద్రం చిత్రం చేస్తున్నాడు.