ఆసక్తికర కాంబినేషన్ తో అంచనాలని పెంచుతున్న “మహాసముద్రం ” మూవీ

aditi rao joined in mahasamudram movie

‘Rx 100’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి. చాలామంది అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ అత కోనురుకున్నట్లుగా రెండో సినిమా మొదలవ్వటానికి బాగా ఆలస్యం అయిపోయింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన రెండేళ్లకు కూడా కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు.

aditi rao joined in mahasamudram movie
aditi rao hydari

ఇటీవల ”మహాసముద్రం” అనే ఆసక్తికర ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ మరియు ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఇచ్చారు. టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

sharwaand and ajay bhupati new movie
sharwaand and ajay bhupati new movie maha samudram

అజయ్ భూపతి-శర్వానంద్ కాంబినేషన్ అంటేనే ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందనే ఒక అంచనా ఏర్పడింది. వీళ్లకు సిద్దార్థ్ కూడా తోడవడంతో ఆసక్తి ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి అదితిరావు హైదరి కూడా వచ్చింది. ‘సమ్మోహనం’ దగ్గర్నుంచి అదితి సినిమాలపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఆమె నుంచి ప్రేక్షకులు చాలానే ఆశిస్తున్నారు. శర్వా-సిద్ధు-అదితి.. ఈ ముగ్గురి కలయిక భిన్నమైందే.దర్శకుడి మొదటి సినిమాలో హీరోయిన్ పాత్ర అంచనాలకి అందకుండా ప్రేక్షకులకి మతులు పోగొట్టింది. ఇప్పుడు ఈ టాలెంటెడ్ బ్యూటీతో ఎలాంటి మాయ చేస్తాడో అని అంచనాలు పెరిగిపోయాయి.