కృష్ణా నది వరదలు.. మునిగిపోయిన హీరో శర్వానంద్ తాత ఇల్లు

hero sharwanand grandfather house drowned in floods

ప్రస్తుతం కృష్ణా నది పొంగిప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

hero sharwanand grandfather house drowned in floods
hero sharwanand grandfather house drowned in floods

ఇప్పటికే కృష్ణానది ఒడ్డున ఉన్న చంద్రబాబు ఇంటికి కూడా వరద ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. తాజాగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ తాత ఇల్లు కూడా కృష్ణా నది వరద ప్రవాహానికి నీటిలో కొట్టుకుపోయింది. అది మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు. అది కృష్ణానది ఒడ్డున ఉంది. హరిప్రసాద్ హీరో శర్వానంద్ కు తాత.

hero sharwanand grandfather house drowned in floods
hero sharwanand grandfather house drowned in floods

కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర ఉన్న ఈ ఇంటికి శర్వానంద్ కూడా అప్పుడప్పుడు వస్తుండేవారు. కొన్నిరోజులు ఇదే ఇంట్లో గడిపి వెళ్లేవారు. తాజాగా వచ్చిన కృష్ణా వరదలకు ఆ ఇల్లు కొట్టుకుపోయింది.

శర్వానంద్ తాత ఇల్లు వరదలో కొట్టుకుపోవడంతో స్థానికులు అక్కడికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు శర్వానంద్ ముత్తాత ఇల్లు కూడా పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.