పెంచిన పాముతో కాటేయించుకున్న యువ నిర్మాత.!

ఓ యువ నిర్మాతకీ, ఓ మీడియా పర్సన్‌కి మధ్య యవ్వారం బెడిసికొట్టిందట. ఎక్కడ తేడా కొట్టిందో ఏమో తెలీదు కానీ, ఏకంగా ఓ పెద్ద సినిమాకే ఎసరు పెట్టేసేంత పని జరుగుతోందంటూ చర్చ నడుస్తోంది.

అన్నీ బాగున్నన్నాళ్లూ రాసుకు పూసుకు తిరిగిన ఈ ఇద్దరూ యవ్వారం బెడిసికొట్టాకా ఒకరి మీద ఒకరు.. కాదు, కాదు, సదరు మీడియా పర్సన్ ఆ యువ నిర్మాత మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడట.

పాముకి పాలు పోసి పెంచితే ఇలాగే వుంటుంది. అది విషపు కాటే వేస్తుంది.. అంటూ సినీ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పుడీ టాపిక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సదరు మీడియా వ్యక్తి చొరవతో ఓ పెద్ద సినిమా దాదాపు ఆగిపోయే పరిస్థితి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది.

అయినా ఆ మీడియా పర్సన్‌కి ఇది కొత్తేం కాదు. గతంలోనూ పలు మార్లు ఇలాంటి యవ్వారాలు నడిపించడం, తేడా కొడితే, రివర్స్ గేర్ వేయడం మామూలే. అయితే, ఈ సారి యువ నిర్మాత సదరు మీడియా పర్సన్ కొట్టిన దెబ్బకి భారీగా నష్టపోయే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.